నిజానికి ఈ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసే అంశంపై రెండు రోజుల పాటు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈనేపథ్యంలో గురువారం చంద్రబాబును వైజాగ్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు టిక్కెట్ ఖరారు చేశారు. సుహాసిని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఆ సెగ్మెంట్‌కు చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. దీంతో శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాగా, హరికృష్ణ కుమార్తె సుహాసిని తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ సతీమణి. పిల్లల చదువుల కోసం సుహాసిని హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా స్థిరపడిపోయారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఆమెకు పార్టీ టిక్కెట్ కేటాయించారు.