తెలంగాణాలో స్కూల్స్ - కాలేజీలకు సెలవులు ప్రకటించిన మంత్రి సబితా

శనివారం, 4 సెప్టెంబరు 2021 (16:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సెలవులు ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఈ సెలవులు వెల్లడించారు. 
 
మొత్తం 213 పని దినాలతో కొత్త విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపారు. ఇందులో 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 
 
అదేసమయంలో అక్టోబరు 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. మిషనరీ స్కూల్స్‌లు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులను వెల్లడించారు. 
 
ఇకపోతే సంక్రాంతి సెలవులుగా జనవరి 11 నుంచి 16 వరకు, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ వరకు ఉంటాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు