పోలీసులకు కొత్త మాన్యువల్.. సీఎం కేసీఆర్ నిర్ణయం?

శుక్రవారం, 8 జులై 2022 (20:41 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పోలీసులకు కొత్త మాన్యువల్ అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
 
కొత్త మాన్యువల్ ముసాయిదాను సిద్ధం చేసిన అధికారులు న్యాయశాఖ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఇది ఆమోదం పొంది అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
పోలీస్ శాఖలో TSSP, AR, సివిల్ విభాగాల వారీగా నియామకాలు జరుగుతుండగా ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా ఒక విభాగం నుంచి మరో విభాగంలోకి వచ్చేందుకు (కన్వర్షన్)కు ఇప్పటి వరకు అవకాశం ఉండేది. అయితే ఈ విధానం వల్ల పదోన్నతుల సమయంలో న్యాయపరమైన చిక్కులు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. 
 
సీనియార్టీ విషయంలో తమకు అన్యాయం జరుగుతోందనే వాదనలు ఉద్యోగుల నుండి వస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఇకపై ఏ విభాగంలో చేరిన వారు ఆ విభాగంలోనే పదవీ విరమణ జరిగేలా ముసాయిదాలో సూచించినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు