తెలంగాణ సచివాలయంలో ఏ శాఖ ఏ అంతస్తులో..

గురువారం, 27 ఏప్రియల్ 2023 (11:33 IST)
తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం ఈ నెల 30వ తేదీన ప్రారంభంకానుంది. ఈ కొత్త భవనంలో ఏ మంత్రిత్వ శాఖ ఏ అంతస్తులో ఉండాలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. 
 
గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎస్సీ సంక్షేమం - అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక - ఉపాధి కల్పనశాఖలు ఉంటాయి. 
 
మొదటి అంతస్తులో హోం, విద్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు, రెండో అంతస్తు: వైద్య ఆరోగ్య, విద్యుత్‌, పశుసంవర్ధక, ఆర్థిక శాఖలు ఉంటాయి. 
 
మూడో అంతస్తులో మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ధి - ప్లానింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలను ఏర్పాటు చేశారు. 
 
నాలుగో అంతస్తులో పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమం, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, నీటిపారుదల, న్యాయశాఖలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 
 
అయిదో అంతస్తులో రవాణా, రహదారులు- భవనాలు, సాధారణ పరిపాలన శాఖలు, ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం కార్యదర్శులు, సీఎం పేషీ ప్రత్యేకాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గదులుంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు