సర్కారు ఆస్పత్రిలోనే పండంటి బాబుకు జన్మనిచ్చిన కలెక్టర్

బుధవారం, 10 నవంబరు 2021 (13:32 IST)
ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా కొందరు మాత్రమే కష్టపడుతుంటారు. అలాంటి వాళ్లలో ఒకరే యువ ఐఏఎస్ అనుదీప్ దురిశెట్టి. తెలంగాణలోనే పెట్టిపెరిగి, రాష్ట్ర కేడర్ కే ఎంపికైన అనుదీప్ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.

collector
యువతకు స్ఫూర్తి మంత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన.. మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు.  ఆమె ఓ జిల్లాకు ప్రథమ మహిళ. అందుబాటులో సకల వసతులు. అయితేనేం సర్కారు ఆస్పత్రిలోనే పండంటి బాబుకు జన్మనిచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్.. తన భార్య ప్రసవాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనుదీప్ భార్య మాధవి భద్రాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి గర్భిణీ కావడంతో తొలి కాన్పు కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేరారు.

ఎమర్జెన్సీగా గర్భిణీకి ఆపరేషన్ అవసరం అవడంతో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్టు సూరపనేని.శ్రీక్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్థీషియా వైద్య నిపుణులు దేవిక ల ఆధ్వర్యంలో లో ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై .రాజశేఖర్ రెడ్డి శిశువును పరీక్షించి వైద్యం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు