కొందరు పిల్లలు వింత వింతగా జన్మిస్తుంటారు. కొందరి రెండు తలలు, మూడు కాళ్లు ఇలా ఏదో ఒక వింత ఆకారం ఉంటుంది. తాజాగా ఓ బాలుడు నిజమైన తోకతో జన్మించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.
దీనిని నిజమైన మానవతోకగా అభివర్ణిస్తున్న వైద్యులు.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని, చర్మానికి మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు చెప్పారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.