కామారెడ్డి కలెక్టర్‌కు నిర్మలమ్మ వార్నింగ్.. అర్థగంట టైమిస్తున్నా..

శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (14:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పేదలకు రేషన్ సరకుల్లో కేంద్రం వాటా ఎంత? రాష్ట్ర వాతా ఎంత? అంటూ ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ తనకు తెలియదని సమాధానం ఇవ్వడంతో నిర్మలమ్మకు చిర్రెత్తుకొచ్చింది. అంతే.. ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అర్థగంట సమయమిస్తున్నా.. తెలుసుకుని రాపో అంటూ గట్టిగా మందలించారు. 
 
ఈ సంఘటన కామారెడ్డి  జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్‌లో ఓ రేషన్ షాపును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్‌‍పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉచిత రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్ర వాటా ఎంత? అని ఆమె నిలదీశారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేక పోయారు. తనకు తెలియదని చెప్పారు. దీంతో ఆయనపై ఆమె ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారి అయిన మీకు తెలియకపోవడం ఏంటని కన్నెర్రజేశారు. 
 
అరగంట సమయం ఇస్తున్నానని, తెలుసుకుని వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించారు. అంతేకాదు, రేషన్ షాపు వద్ద ఉన్న ఫ్లెక్సీలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో కూడా నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని అందిస్తుందని, అలాంటపుడు ప్రధాని ఫోటోను ఎందుకు ఉంచలేదని ఆమె నిలదీశారు. రేషన్ షాపుల ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని లేకపోతే తానే స్వయంగా వచ్చి పెడతానని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు