తెలంగాణలో మళ్లీ ఆన్ లైన్ క్లాసులు.. 17 నుంచి మొదలు?

శనివారం, 15 జనవరి 2022 (22:34 IST)
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ ఆన్ లైన్ క్లాసులను నిర్వహించే దిశగా  సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ మేరకు ఈనెల 17 నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఈ నెల 16న దీనిపై విద్యాశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే విద్యాధికారుల ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంది.  
 
మరోవైపు కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 17 నుంచి 22 వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఇప్పటికే హైదరాబాద్ జేఎన్టీయూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు