పురుగు మందు కొట్టిన నీరు తాగి నెమళ్లు మృతి

శుక్రవారం, 31 జులై 2020 (14:33 IST)
యాదాద్రి భువన గిరి జిల్లాలోని బొమ్మలరామరం ప్యారారం గ్రామ పరిధి శామీర్ పేట్ వాగులో ఆరు నెమళ్లు  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. స్థానిక వీఆర్ఏ మల్లేష్ ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
 
ప్రాథమికంగా చుట్టూ ఉన్న రైతులు, వారి పంట పొలాల్లో ఎరువుల పరిమాణాన్ని పరిశీలించారు. ఎక్కువ పరిణామంలో క్రిమిసంహారక మందులు చల్లడంతోనే జాతీయ పక్షి అయిన నెమళ్లు మృతి చెందాయన్నారు. అవి ఆ పొలాల్లోని నీటిని తాగడం, ఆ పంట పొలాల్లో ఆహారం తీసుకోవడంతోనే మరణించాయని నిర్ధారణకు వచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు