నాయనా లెయ్ రా.. కొడుకు ప్రాణాలు కోవిడ్ తీస్తుంటే ఆ తల్లి పడిన రోదన, గుండె పిండేస్తుంది

ఆదివారం, 19 జులై 2020 (22:02 IST)
కరోనావైరస్, ఎంతోమంది ప్రాణాలను కబళిస్తుంది. మరెంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వాలు సాయం చేస్తున్నామని చెపుతున్నా, ఆ సాయం కొంతమంది బాధితులకు అందేలోపే ఆ ఇంటి దీపం ఆరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణిస్తున్నవారి ఉదంతాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
 
ఈ రోజు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఓ యువకుడు తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. తన కొడుకు ఊపిరిని ఎలాగైనా నిలబెట్టాలని ఆ తల్లి పడిన వేదన చూసిన ప్రతి ఒక్కరికి గుండె చెరువవుతోంది. ప్రాణాల కోసం పోరాడుతూ ఓడిపోతున్న ఆ కొడుకును నాయనా లెయ్ రా.. అంటూ ఆమె గద్గర స్వరంతో అడుగుతూ వుండగానే ఆ కన్నకొడుకు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
 

PAINFUL! While we are looking at numbers in the health bulletin &thinking all is fine, this happened at Nalgonda #COVID19 hospital in #Telangana today. Here is a mother desperately trying to help her son breathe.The mother’s agony &love couldn’t save her son #TelanganaCovidTruth pic.twitter.com/gZ6PMEa4ov

— Revathi (@revathitweets) July 18, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు