హైదరాబాద్‌లో పెట్రోల్ కొనలేం!

గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:47 IST)
హైదరాబాద్‌లో వారం రోజుల నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర నిలకడగా ఉన్నప్పటికీ... ధర మాత్రం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.

నగరంలో బుధవారం పెట్రోల్‌ ధర రూ. 89.77 కాగా వారం రోజుల నుంచి ఇదే ధర నిలకడగా కొనసాగుతోంది. నగరంలో డీజిల్‌ ధర కూడా వారం రోజుల నుంచి రూ. 83.46గా కొనసాగుతోంది.

వరసగా పెరుగుతున్న పెట్రో ధరలతో సగటు జీవి సతమతమవుతున్నాడు. ఈ ధరలు బుధవారం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరాయి.

మంగళవారం ఆయా నగరాల్లో గరిష్ట ధరకు చేరిన పెట్రో ధరలు బుధవారం మరో రూ. 0.25 పెరగడంతో ఆల్‌ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 85.20, ముంబైలో రూ.91.80 ఉన్నాయి. డీజిల్‌ ధరలు కూడా అదే ఊపును కొనసాగిస్తున్నాయి. దేశ రాజధానిలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 75.38 కాగా, ముంబైలో రూ. 82.13 ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు