దీనిపై ఆయన స్పందిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణకు ఏమీ చేయలేదు.. విడిపోయిన తర్వాత కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయం, ధర్మం తెలంగాణ పక్షాన ఉన్నాయని, మనకేమీ నష్టం జరుగదన్నారు. రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తాము చేపట్టిన ప్రాజెక్టులను వంద మంది బాబులు, వేయి మంది జగన్‌లు వచ్చినా ఆపలేరన్నారు. నిజాంసాగర్ ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు 47 ప్రాజెక్టులు నిర్మించాయని, శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్ర 300 ప్రాజెక్టులు నిర్మించిందని ఆయన తెలిపారు.