అమీర్‌పేటలో డ్రగ్స్ కలకలం.. టెక్కీలో లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా!

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:15 IST)
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో డ్రగ్స్ కలగలం చెలరేగింది. ముగ్గురు సభ్యుల ముఠాను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరు ఉపయోగించిన 2 కార్లు, బైకులను కూడా సీజ్ చేశారు.
 
భారతీయ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ వ్యవహారంలో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ పలువురు సినీ ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఈ పరిస్థితుల్లో అమీర్‌పేటలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 
 
దీంతో నిఘా వేసిన పోలీసులు... ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఈ ముఠా నుంచి 105 గ్రాముల ఎండీఎం, 25 కొకైన్, 250 గ్రాముల గంజాయి, 4 గ్రామాల ఎల్సీడీ రకం మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 కార్లు, బైకులు సీజ్ చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు