జోగుతున్న సినీ ఇండస్ట్రీ.. సుశాంత్ మృతితో వెలుగులోకి డ్రగ్స్ దందా

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (15:42 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కేసులో డ్రగ్స్ కోణం బయట పడింది. ఇప్పటికే ఈ కేసుని ఈడీ, సీబీఐలు విచారణ చేపట్టగా డ్రగ్స్ కోణం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కూడా విచారణ చేస్తుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియాకి డ్రగ్ డీలర్స్‌తో సంబంధం ఉందని తేలడంతో ఆ వైపుగా పరిశీలిస్తున్నారు.
 
ఇప్పటికే బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా సోదరుడు శోవిక్ ని, సుశాంత్ మేనేజర్ ని, వాళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసే మరి కొంతమందిని అరెస్ట్ కూడా చేసారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారని వెతుకుతున్నారు పోలీసులు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సుశాంత్ మరణం తర్వాత సుశాంత్ కి సపోర్ట్ గా బాలీవుడ్ మాఫియాపై యుద్ధమే చేస్తుంది.
 
ఈ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోలందరూ డ్రగ్స్ తీసుకుంటారని, అందరికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు కన్నడ సినీపరిశ్రమ శాండిల్ వుడ్ లో కూడా డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది.
 
ఇప్పటికే బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఈ డ్రగ్స్ కేసులో కన్నడ పరిశ్రమలో 15 మందికి పైగా నోటీసులు ఇచ్చారు. ముగ్గురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసారు. డ్రగ్స్ వాడుతుందన్న నెపంతో హీరోయిన్ రాగిణి ద్వివేదిని కూడా అరెస్ట్ చేసారు. మరి కొంతమంది హీరో హీరోయిన్ల ఇళ్లను సోదా చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు