రాష్ట్రపతి రాంనాథ్ కోవింజ్ ఆదివారం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ ప్రకటన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు వచ్చి పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్‌కు చేరుకుంటారు.
ఈ రాత్రికి ఆయన రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ వైపు ఎవరూ రాకపోవడంతో పోలీసులు విన్నవిస్తున్నారు.