ఓ ప్రేమోన్మాది బెదిరింపులకు వివాహిత వణికిపోయింది. తొలుత అతడి బెదిరింపులను లైట్ గా తీసుకున్న ఆ గృహిణికి రానురాను అవి తీవ్రస్థాయికి చేరడంతో భయపడి పోలీసు కేసు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గాజుల రామారానికి చెందిన ఓ వివాహితను ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన ఆట్ల సతీశ్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో అతడితో ఆమెకు పరిచయం మాత్రమే వుండటంతో దాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
ఆమెకు పెళ్లి అయిపోయినా.... నిన్నే ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమె భర్తను చంపి ఆ తర్వాత వివాహం చేసుకుంటానంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె అతడి టార్చర్ భరించలేక నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కేపీహెచ్ బి ఆసుపత్రిలో చేర్పించారు.