కసాయి తండ్రి రెండేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. 2014 లో అత్యాచారం గురించి పాప స్కూల్ టీచరుతో చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. తల్లిని కోల్పోయిన బాలిక తండ్రి, సోదరుడితో కలిసి ఉంటోంది. తండ్రి రెండేళ్ల నుంచి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.
తండ్రి బెదిరించడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 2014లో రాఖీ పండగ సందర్భంగా కుమార్తెను ఇంటికి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఉపాధ్యాయుడికి చెప్పి ఆయన ద్వారా జిల్లా పిల్లల రక్షణ కేంద్రం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలల హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దోషికి ఈ శిక్ష సరిపోదని, మరణ శిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యాక్షుడు అత్యుత రావు డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని తెలిపారు.