ఎస్‌ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి.. ఏమైంది?

గురువారం, 16 జూన్ 2022 (16:06 IST)
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన "ఛలో రాజ్‌భవన్‌" కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ ఎస్‌ఐ చొక్కా పట్టుకున్నారు. 
 
అసెంబ్లీలో దొంగలకు సెల్యూట్ చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లకుండా పోలీసులు తనను చుట్టుముట్టడంతో కోపంతో ఊగిపోయారు. 
 
రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారుల నిరసనకు దిగారు. ఖైరతాబాద్‌లో నడిరోడ్డుపై బైక్‌కు నిప్పుపెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు