సేవలు సంతృప్తినిచ్చాయి: వీసీ సజ్జనార్

బుధవారం, 25 ఆగస్టు 2021 (20:28 IST)
సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి  వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆలాగే తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, తెలంగాణ రాష్ట్ర డిజిపికి, ప్రజా ప్రతినిధులకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి, రంగారెడ్డి జిల్లా జడ్జికి, సంగారెడ్డి జిల్లా జడ్జి కి, మహబూబ్ నగర్ జిల్లా జడ్జి కి, సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు,

సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ మరియు తెలంగాణ పోలీస్ అధికారులకు, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఇతర సంస్థలు, ఎస్సీ ఎస్సీ బృందానికి ముఖ్యంగా ప్రతీ ఒక్క అడుగులో వెన్నంటి నడిచి ప్రోత్సహించిన రంగా రెడ్డి, మేడ్చల్ ప్రజా సంఘాలకు, ప్రజలకు  వీసీ సజ్జనార్, ఐపీఎస్ కృతజ్ఞతలు తెలిపారు.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్‌గా సేవలు అందించిన సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు