సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సీఎం జగన్ మానసపుత్రికలన్న మంత్రులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
సీఎం జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నామన్నారు. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులకు సూచించామన్నారు. సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం జగన్ ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు.