తెలంగాణలో కరోనాకు ప్రత్యేక ఆసుపత్రి

బుధవారం, 4 మార్చి 2020 (07:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకున ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవసరమైన మేరకు సిబ్బందిని తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు.

అనుమానిత రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.

తొమ్మిది శాఖలు సమన్వయంతో పని చేయాలని... ప్రతి శాఖలోనూ ప్రత్యేకంగా నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అవసరమైన మేరకు ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ప్రైవేటు ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని... అనుమానిత రోగులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని కోరినట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు