తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన ఆగేట్లు లేదు. నేటితో ఇంటర్ రీ-వాల్యువేషన్, రీకౌంటింగ్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆల్ పాస్ కాకుండా ముప్పావు శాతం మందిని ఫెయిల్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్‌సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.