12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్.. తెలంగాణలో 17.23 లక్షల మందికి..?

బుధవారం, 16 మార్చి 2022 (12:17 IST)
దేశవ్యాప్తంగా బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో తెలంగాణలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్‌లు వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 
 
మొత్తం 17,23,000 మంది చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ను అందించనున్నారు. అలాగే నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఇ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడిన కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను పిల్లలకు అందుబాటులో వుంచనున్నారు. 
 
మార్చి 15, 2010న, అంతకుముందు జన్మించిన పిల్లలందరూ కోవిడ్ వ్యాక్సిన్‌కు అర్హులు. వ్యాక్సినేషన్ స్లాట్‌ను రిజర్వ్ చేయడానికి రిజిస్ట్రేషన్‌లు ఆన్‌లైన్, ఆన్-సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు