ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా కాలంలో ఆల్ పాస్ అని చెప్పి... ఫెయిల్ చేశారనే ఆరోపణలు, ఆందోళనలు మొదలైయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్టియర్‌లో అందరినీ పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ మినిమమ్ పాస్ మార్కులు 35 వేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
ఇంటర్ బోర్డు, ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదన్నారు. పిల్లల భవిష్యత్‌తో రాజకీయాలు చేయొద్దన్నారు. కరోనాతో విద్యార్థులు ఎంతో నష్టపోయారని.. అందుకే 70 పర్సంటేజ్ సిలబస్ తోనే ఎగ్జామ్స్ పెట్టామన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తే పాస్ చేస్తారనుకోవడం తప్పన్నారు. అందరినీ పాస్ చేయడం ఇదే లాస్ట్ అన్నారు.