తెలంగాణలో కోవిడ్ విజృంభణ.. 24గంటల్లో 58 మంది మృతి

గురువారం, 29 ఏప్రియల్ 2021 (10:34 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 80,181 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 7,994 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. 
 
నిన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి వ్యాప్తి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,208కి పెరిగింది. ఒక్క రోజే 4,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,49,692కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
రాష్ట్రంలో రికవరీ రేటు 81.71శాతం ఉండగా.. మరణాల రేటు 0.51శాతంగా ఉంది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు