ఈయన గతంలో హైదరాబాద్ ఎల్.బి నగర్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అయితే, ఈ స్థానం ప్రస్తుతం సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కృష్ణయ్యకు మిర్యాలగూడ స్థానం బరిలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ స్థానం నుంచి తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది.
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్నారు. ఈనెల 23వ తేదీన మేడ్చల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, సోనియా గాంధీ పర్యటన కేవలం మూడంటే మూడు గంటల్లో ముగియనుంది.