మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 2021 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా ప్రభుత్వం మార్చింది. రాష్ట్రంలో 2,216 దుకాణాలకు లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు.
జనాభా ప్రాతిపదిన లైసెన్స్ ఫీజులు ఖరారు చేశారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్షల జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.60 లక్షలు లక్ష జనాభా నుంచి 5 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షల లైసెన్స్ ఫీజు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ1.10 కోట్లు.