తెలంగాణాలో భారీ వర్షాలు, పరీక్షలు వాయిదా

సోమవారం, 19 అక్టోబరు 2020 (12:27 IST)
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోలేదు. ఈలోగా వాతావరణశాఖ మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలను యూనివర్శిటీలు తిరిగి నిర్వహిస్తున్నాయి.
 
అయితే, ప్రస్తుతం వాతావరణం అనుకూలించకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అలానే జెఎన్టియు, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బిఈడి పరీక్షలను కూడా వాయిదా వేశారు.
 
అక్టోబర్ 19, 20 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయగా, వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 21 నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్లను యూనివర్శిటీ వెబ్ సైట్‌లో ఉంచినట్టు యూనివర్శిటీలు ప్రకటించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు