నీట్ పరీక్షల్ని వాయిదా వేసేది లేదు.. అడ్మిట్ కార్డుల విడుదల

బుధవారం, 26 ఆగస్టు 2020 (19:05 IST)
NEET
కరోనా కారణంగా నీట్ పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్ పెరిగిపోతున్న తరుణంలో నీట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీ‌ఏ) విడుదల చేసింది. తన అధికారిక వెబ్ పోర్టల్ నుంచి వీటిని రిలీజ్ చేశామని, పరీక్షకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు దీని నుంచి వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చునని ఎన్టీఏ వెల్లడించింది. ఈ కార్డుల్లో పరీక్షకు సంబంధించిన సమాచారంతో బాటు పరీక్షా కేంద్రాల్లో వారు పాటించవలసిన నిబంధనలను కూడా వివరించారు. 
 
సెప్టెంబరు 13న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఎన్నోసార్లు వీటిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుది తేదీలో ఎలాంటి మార్పును ఎన్టీఏ ప్రకటించలేదు. 
 
అయినా అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ని చెక్ చేస్తుండాలని ఎన్టీఏ సూచించింది. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, కాదు., నిర్వహించి తీరాల్సిందేనని మరికొందరు కోరుతున్నారు. అయితే కేంద్రం మాత్రం మళ్ళీ వీటిని వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు