హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రుణం తీసుకున్నాడు. అది తిరిగి చెల్లించడంలో జాప్యమైంది. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు భరించలేక ఆ వ్యక్తి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో మృతుని భార్య గర్భంతో ఉండగా, ఇపుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తన భర్త మృతితో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అదేసమయంలో లోన్ యాప్ నిర్వాహకులు రెండేళ్ల పాటు మిన్నకుండిపోయారు. ఇపుడు మళ్లీ వేధింపులకు దిగారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన పండిటి సునీల్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. అదేసమయంలో భార్య రమ్యశ్రీ గర్భంతో ఉండటంతో అప్పులు తీసుకున్నాడు.