ఆగస్టు 1 నుంచి 10 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

గురువారం, 30 జూన్ 2022 (10:22 IST)
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. అలాగే ఆగస్టు నెలాఖరుకు ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది.
 
ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. 
 
ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణులు కాని వారికి జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు జులై 22న మానవ విలువలు, జులై 23న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు