పొట్టలో కత్తెరలను వుంచి ఆపరేషన్ చేసేసే వైద్యులు గురించి వినే వుంటాం. తాజాగా ఓ బాలుడు ఎల్ఈడీ బల్బును మింగేశాడు. శ్వాసనాళంలో ఊపిరితిత్తుల సమీపంలో ఆ చిన్న బల్బు చిక్కుకుపోయింది. అందుకనే అతడు శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. దగ్గుతో ఆయాసపడ్డాడు. శ్వాస సమస్యలు, దగ్గుతో అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎలాంటి సర్జరీ లేకుండా నోటి ద్వారానే ఆ బల్బును బయటకు తీశారు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది.