నిరుద్యోగులకు గుడ్ న్యూస్-పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (13:19 IST)
తెలంగాణ సర్కార్ తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో భారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన వెంటనే వరుసగా జాబ్స్ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. తద్వారా నిరుద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని సర్కార్ యోచిస్తోంది. 
 
ముందుగా అత్యధిక ఖాళీలు ఉన్న పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో దాదాపు 20 వేల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. 
 
దీంతో ముందుగా ఆ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ సుధీర్ఘంగా సాగుతుంది. దీంతో ముందుగా ఆ నోటిఫికేషన్ విడుదల చేస్తే సాధ్యమైనంత త్వరగా ఆ ఉద్యోగాల భర్తీని పూర్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
పోలీసు శాఖ తర్వాత అత్యధిక ఖాళీలు ఉన్న శాఖలుగా విద్య, వైద్య శాఖలను ప్రభుత్వం గుర్తించింది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు