భూమిని తవ్వేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటిలో ఆర్సెనిక్..!

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:07 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తాగే నీటిలో ఆర్సెనిక్... సహజంగా ఉండేదాని కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సడెన్‌గా ఇది ఎందుకు ఎక్కువ అవుతోందంటే... భూగర్భ జలాలు పడిపోవడమేనని తేలింది. తాగు నీటి కోసం ప్రజలు భూమిని ఇంకా ఇంకా లోతుగా తవ్వేస్తున్నారు. అలా లోతు ఎక్కువయ్యే కొద్దీ... తాగు నీటిలో రసాయనాలు, ప్రమాదకర ఖనిజ మూలకాలు ఎక్కువవుతాయి. 
 
ఎక్కడైతే భూగర్భ జలాల కోసం బాగా తవ్వేస్తున్నారో అక్కడి నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటోందని తేలింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్) ప్రకారం.. లీటర్‌ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఆర్సెనిక్‌ ఉండొచ్చు. అప్పుడు మనకు ఏమీ కాదు. అది కాస్త ఎక్కువైనా చాలు ప్రాణాలకే ప్రమాదం.
 
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల, గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల.. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట భూగర్భ నీటిలో బీఐఎస్ చెప్పిన దాని కంటే ఎక్కువగా ఆర్సెనిక్‌ ఉదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. ఇప్పుడు ఎవరైనా ఆ నీటిని తాగినా... లేదంటే... ఆ నీటితో పండించిన పంటల దిగుబడిని తిన్నా ప్రమాదమే. మనుషుల, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ పాడైపోతుంది. 
 
బోన్‌మ్యారో (ఎముక మజ్జ), చర్మ కాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 1980లో బెంగాల్‌లోని భగీరథి నదీ తీరంలో సీడబ్ల్యూసీ జరిపిన పరిశోధనలో ఆర్సెనిక్‌ మొదటిసారి బయటపడింది. దేశవ్యాప్తంగా సీడబ్ల్యూసీ... తాగునీటిపై పరిశోధనలు చేస్తోంది. కొత్తగా 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్‌ ప్రభావం ఉంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు