తెలంగాణలో 189 కరోనా కేసులు.. దేశంలోనూ 17వేల కేసులు

బుధవారం, 10 మార్చి 2021 (11:56 IST)
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 176 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,342 కి చేరింది. 
 
ఇప్పటివరకు మొత్తం 2,96,916 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,646గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,780 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 693 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
అలాగే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,921 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,62,707కు పెరిగింది. తాజాగా మరో 20,652 మంది డిశ్చార్జి కాగా.. 1,09,20,046 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ చెప్పింది. కొత్తగా 133 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,063కు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు