అన్నీ రంగాల్లో ముందుండే హైదరాబాద్ వాసులు ఆరోగ్య విషయం వెనుకాడుతున్నారు. నగరంలో చాలామంది షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నారు. కేవలం 19 శాతం మంది మాత్రమే బీపీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది.
అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒకేచోట కూర్చొని పనిచేసే జీవన విధానం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గ్లోబల్ హాస్పిటల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కలసి చేసిన స్టడీ రిపోర్ట్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తాజాగా విడుదల చేశారు.
బీపీ, షుగర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ప్రాణాంతకంగా మారతాయని ఆయన హెచ్చరించారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలని, వ్యాధి ఉన్నట్టు తేలితే రెగ్యులర్‌గా మందులు వాడాలని సూచించారు.