ప్రేమ సరే సునీతా... రూ.6 లక్షలిస్తేనే తాళిబొట్టు కడతా... అందుకే సూసైడ్...

శనివారం, 25 ఫిబ్రవరి 2017 (15:36 IST)
ప్రేమ కాటుకు బలైన టెలీకాలర్ సునీత ఆత్మహత్య కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో సునీతను వలలో పడేసిన ప్రియుడు శ్రవణ్ ఆ తర్వాత అతడి నిజ స్వరూపం బయటపెట్టాడు. పెళ్లాడాలంటే తనకు రూ.6 లక్షల కావాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బు తీసుకువస్తేనే నిన్ను పెళ్లాడతానుంటూ కండిషన్ పెట్టాడు. పైగా ఇప్పటికే మరో ఐదుగురు అమ్మాయిలను మోసం చేశాడని కూడా తేలింది. దీనితో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
కాగా ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ మాదాపూర్‌లో టెలికాలర్‌ సునీత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై చనిపోయిందని తేల్చారు. గచ్చిబౌలిలో టెలికాలర్‌గా పనిచేసే ప్రియుడిని భాగ్యనగర్‌ సొసైటీ రోడ్డులో నివాసం వుండే సునీత గత కొంతకాలంగా సన్నిహితంగా వుంది. ఐతే వాలెంటైన్స్ డే నాడు తనను పెళ్లి చేసుకోవాలని సునీత అడగడంతో ఆమెను అతడు దూరం పెట్టేశాడు. ప్రేమికుల రోజు నాడు తనను కలవాలని ఆమె కోరినప్పటికీ అతడు పట్టించుకోలేదు. దానితో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

వెబ్దునియా పై చదవండి