కేయూ డిగ్రీ ‘టైమ్ టేబుల్’ వచ్చేసింది

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:43 IST)
కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌‌ను వ‌ర్సిటీ అధికారులు విడుద‌ల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ ఎస్. మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వివరాలను వెల్లడించారు. బీ.కామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు,  కాగా బి.ఎడ్ సెకెండ్ ఇయర్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 11 నుండి 16వ తేదీ వ‌ర‌కు జరుగుతాయ‌న్నారు.

విద్యార్థులు ఫేస్ మాస్కులు ధ‌రించి ప‌రీక్ష‌లు హాజ‌రు కావాల్సిందిగా సూచించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు తాము అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటున్న‌ట్లుగా వెల్లడించారు.

పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చ‌ని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు