హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య

సోమవారం, 30 నవంబరు 2020 (20:03 IST)
కోవిడ్ నేపథ్యంలో విమానాశ్రయాల పున: ప్రారంభం అనంతరం విమాన ప్రయాణీకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు సురక్షితమన్న నమ్మకం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటూ, దేశీయ ప్రయాణికుల సంఖ్య నవంబర్ నెలలో 37,000 కు చేరింది.
 
అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణీకుల వైద్య పరీక్షలు ఇతర వాటి ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో భారత విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.

అనేక రాష్ట్రాలు ఇంకా ప్రయాణికుల ఆరోగ్య ప్రొపైల్,  మెడికల్ రిపోర్టులను అడుగుతున్నా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న కోవిడ్ టెస్టింగ్ కేంద్రం లాంటి వాటి కారణంగా, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నారు. 
 
మే 25 నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 3000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు