అయితే, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు. ఇది తమ తొలి విజయమని షర్మిల అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతలపాడు మండలంలోని దొండపాడు వెళ్లి ఇటీవల కరోనాతో మృతి చెందిన వైసీపీ నేత, ఏపీ బేవరేజెస్ కోఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.