ఉపాధి ఉందని నమ్మించారు.. మహిళను తీసుకెళ్ళి అమ్మేశారు.. ఎక్కడ?

మంగళవారం, 13 ఆగస్టు 2019 (20:35 IST)
నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తే గాని ఇళ్ళు గడవని పరిస్థితి. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి మంచానికి పరిమితమైంది. దీంతో ఆ మహిళకు ఏమీ తోచలేదు. దీన్నే ఆసరాగా తీసుకున్నారు ముగ్గురు యువకులు. ఆమెకు మాయమాటలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మంచి ఉద్యోగం ఉందని చెప్పారు. దీంతో ఆమె నమ్మింది.
 
కష్టాలు తీరిపోతాయనుకుంది. ఉపాధి చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఆ ముగ్గురు యువకులు నమ్మించారు. ఆమెను ఒప్పించారు. తల్లికి నచ్చచెప్పారు. తల్లి కూడా సరేనంది. బట్టలన్నీ సర్దుకుని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి అమ్మేశారు. ఈ ఘటన కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన వెనుక కానిస్టేబుల్ హస్తం ఉందని గుర్తించారు.
 
వారంరోజుల పాటు డబ్బుకు కొనుక్కున్న వ్యక్తి చేసిన టార్చర్‌కు మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. అతని నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు