అటవీశాఖ సిబ్బందికి అష్టకష్టాలు.. ఆడపులి, మగపులి కోసం వెతుకులాట

శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:23 IST)
అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రణాళిక అవలంబిస్తున్న పులి జాడలు అంతుచిక్కడం లేదు. ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
 
ప్రస్తుతం కొమురంభీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందికి ఏ-2 పులి సవాల్‌గా మారింది. 20 మంది సిబ్బందితో కలిసి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని పులల కోసం అటవీ సిబ్బంది అధికారులు గాలిస్తున్నారు. 
 
అంతేకాదు ఏ2 మరో ఆడపులితో కలిసి తిరుగుతోంది. తాజాగా బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి శివారులో తెల్లవారుజామున రెండు పశువులపై దాడి చేసి హతమార్చింది. 
 
పులుల దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మహారాష్ట్రలోని రాజురా ప్రాంతం నుంచి రెండు పులులు గతేడాది ఆసిఫాబాద్‌ అటవీప్రాంతానికి రావడంతో వీటికి ఏ-1, ఏ-2గా నామకరణం చేయటం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు