ప్రాణాల కంటే పవర్ ప్లాంటే ముఖ్యమని భావించారా?

శనివారం, 22 ఆగస్టు 2020 (09:38 IST)
జాతిసంపదగా పేర్కొనే శ్రీశైరం హైడ్రాలిక్ పవర్ ప్లాంట్‌ అగ్నికీలల్లో చిక్కుకోవడంతో దాన్ని రక్షించుకునేందుకు ఆ పవర్ ప్లాంట్ ఉద్యోగులు తమ ఫ్రాణాలను ఫణంగా పెట్టారని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డారు. తమ ప్రాణాల కంటే పవర్ ప్లాంటే ముఖ్యమని భావించారని, అందుకే తొమ్మిది మంది వీరమరణం చెందారని పేర్కొన్నారు. 
 
శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోమంటలు ఎగిసిపడుతున్నా, ప్రాణాలకు ముప్పు అని తెలిసినా ప్లాంటును కాపాడటానికి సాహసం చేశారని చెప్పారు. ప్లాంటులో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 
నిజానికి మొత్తం 900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. 1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంటు ఉన్నది. అక్కడికి సొ రంగమార్గంలోనే చేరుకోవాలి. 
 
ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంటులో 17 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 8 మంది బయటకు రాగలిగారు. మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఎస్కేప్‌ టన్నెల్‌ ద్వారా వచ్చేందుకు ప్ర యత్నించినా దట్టమైన పొగవల్ల సాధ్యం కాలేదు. ఫలితంగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు