తెలంగాణ సర్కారు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్‌గా నియమితులయ్యారు.
తన ఐడెంటిటీ బయటపడ్డాక, తన విద్యార్హతను పట్టించుకోలేదని చెప్పారు. ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ.. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని.. ఆ ఆస్పత్రి యాజమాన్యం తనతో చెప్పిందన్నారు.