కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్ సమావేశంలో వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుగా మారుతోందని, అనవసరంగా కేసులు వేస్తోందన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ రావాల్సిందిగా చట్టంలో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ దిశగా చర్చ జరగలేదన్నారు.
తెలంగాణ గురించి కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదన్న వినోద్.. హైకోర్టు విభజన ఇప్పటికీ జరగకపోవడమే ఇందుకు నిదర్శనమని వినోద్ వ్యాఖ్యానించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చట్టంలో క్లియర్‌గా ఉన్నప్పటికీ.. ప్రధాని ఆ ప్రస్తావనే తేవకపోవడం దారుణమని చెప్పారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని వినోద్ డిమాండ్ చేశారు.