తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే : పవన్ కళ్యాణ్

బుధవారం, 18 అక్టోబరు 2023 (12:45 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు పవన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే చేతులారా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నట్టేనని స్పష్టం చేశారు. 
 
వారి వినతులపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. తనమీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని,అయితే, జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించిన సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరమని చెప్పారు. 
 
సవతి కుమారుడు ఇంట్లో ఉంచుకోవడం ఇష్టంలేక చంపేసిన మహిళ..  
 
సవతి కుమారుడు తమ వద్ద ఉండటం ఏమాత్రం ఇష్టంలేని ఓ మహిళ ఆ బాలుడిని మట్టుబెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఘజియాబాద్‌కు చెందిన రాహుల్ సేన్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేఖ అనే మహిళన రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, రాహుల్‌కు తొలి భార్యతో కలిగిన 11 యేళ్ల కుమారుడు షాదాబ్ ఉన్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన కుమారుడిని తన వద్దే ఉంచుకుని, రెండో భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే, షాదాబ్ తమ వద్ద ఉండటం ఇష్టంలేని రేఖ... అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీన షాబాద్ కనిపించకుండా పోయాడు. అతణ్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు రేఖ భర్తను నమ్మించింది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటి సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. అయితే షాదాబ్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కనిపించలేదు. 
 
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో రేఖ తన నేరాన్ని అంగీకరించింది. తన స్నేహితురాలితో కలసి బాలుడిని హతమార్చి మృతదేహాన్ని మురుగు ట్యాంకులో పడేసినట్టు చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు