తెలంగాణా రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకు పాలకులు ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ జాతరను ప్రారంభించనున్నారు. త్వరలో 28 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా నెలకు రూ.2016 చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. కర్నాటకలోన బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే ఇస్తుందని గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్దిదారులకు పించన్లు అందిస్తున్నామని తెలిపారు. ఎవరూలేనివారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి సీఎం కేసీఆర్ ఆండగా ఉంటున్నారని చెప్పారు.