శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎంబీబీఎస్, జేబీఎస్‌కు చేరుకున్న విద్యార్థులు గానీ, మార్గమధ్యంలోని ఎక్కివారు గానీ ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. అయితే, తాము ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టుగా తగిన ఆధారం చూపించాల్సివుంటుందని టీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఉక్రెయిన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత పౌరులు, విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రొమేనియా వంటి దేశాల రాజధానుల నుంచి ఈ విమానాలను నడుపేలా కేంద్రం చర్యలు తీసుకుంది.