వివాహిత‌ను లొంగ‌దీసుకుని వీడియో తీసి...

శనివారం, 23 మే 2020 (20:41 IST)
వివాహితను లొంగదీసుకుని వీడియో తీసిన ఓ ప్ర‌బుద్ధుడు ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టాడు. దీంతో అవ‌మానానికి గురైన‌ మ‌హిళ‌ ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న‌ ద‌య‌నీయ‌ ఘ‌ట‌న ఖమ్మం జిల్లా పాల్వంచ‌లో చోటుచేసుకుంది.
 
వివాహిత‌ మ‌హిళ‌ను లోబ‌ర్చుకున్న‌ ఇద్ద‌రు యువ‌కులు ఆమెతో న‌గ్న‌ వీడియోలను ర‌హ‌స్యంగా చిత్రీక‌రించారు. అనంత‌రం బ్లాక్ మెయిల్ చేసి సదరు మ‌హిళ‌ను డ‌బ్బులు డిమాండ్ చేశారు. వివాహిత డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే సోష‌ల్ మీడియాలో ఆ వీడియోలు పెడ‌తామంటూ బెదిరించారు. డ‌బ్బులు ఇచ్చేందుకు మ‌హిళ‌ నిరాక‌రించ‌టంతో వాట్సప్‌లో ఆమెకు వీడియోలు పంపించారు.
 
న‌గ్న‌ వీడియోలు వాట్సప్ లోకి రావ‌టంతో అవ‌మానంగా భావించిన సదరు మహిళ పురుగుల మందు తాగి కొత్త‌గూడెం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ృతి చెందింది. నిందితులను క‌ఠినంగా శిక్షించి న్యాయం చేయాల‌ని మ‌ృతురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు