సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఆ ఎఫ్‌బీ డీపీగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అలర్ట్ అయ్యారు. తన అనుచరులందరినీ అప్రమత్తం చేశారు.